Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss 3: నాగార్జున తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే..?

 సీజన్ మొత్తానికి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఎంత తీసుకున్నారనే విషయంపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీజన్ 1, సీజన్ 2 హోస్ట్ లకు ఇచ్చిన దానికంటే నాగార్జున తక్కువే తీసుకున్నట్లు సమాచారం.

Nagarjuna's Remuneration for Bigg Boss 3
Author
Hyderabad, First Published Nov 5, 2019, 5:22 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం నాటి గ్రాండ్ ఎపిసోడ్ తో ముగిసింది. విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచి రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకున్నాడు. అందులో ముప్పై శాతం టాక్స్ లకు పోతుంది. రన్నరప్ గా నిలిచిన శ్రీముఖికి తక్కువేమీ ఇవ్వలేదు. హౌస్ లో 105 రోజులు ఉన్నందుకు గాను ఆమెకి కోటికి పైగా రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.

వీరి రెమ్యునరేషన్ సంగతి సరే.. సీజన్ మొత్తానికి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఎంత తీసుకున్నారనే విషయంపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీజన్ 1, సీజన్ 2 హోస్ట్ లకు ఇచ్చిన దానికంటే నాగార్జున తక్కువే తీసుకున్నట్లు సమాచారం. సీజన్ 1 కోసం ఎన్టీఆర్ దాదాపు రూ.10 నుండి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.

రాహుల్ తో డేట్ కి పునర్నవి నో చెప్పిందా..?

సీజన్ 2కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన హీరో నాని రూ.6 నుండి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సీజన్ 3 కోసం నాగార్జున ముప్పైకి పైగా ఎపిసోడ్ లకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మధ్యలో తన పుట్టినరోజు కోసం స్పెయిన్ వెళ్లడంతో ఒక వీకెండ్ గ్యాప్ ఇచ్చాడు. అయినప్పటికీ రెమ్యునరేషన్ లో ఎలాంటి కటింగ్స్ పెట్టుకోకుండా మొత్తం రూ.5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

తన హోస్టింగ్ తో నాగార్జున అటు హౌస్ మేట్స్ ని ఇటు ఆడియన్స్ ని మెప్పించాడు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా 
కూల్ గా హోస్టింగ్ బాధ్యతలు పూర్తి చేశాడు. తదుపరి సీజన్ లకు కూడా నాగార్జుననే హోస్ట్ గా కంటిన్యూ చేయాలని స్టార్ మా యాజమాన్యం భావిస్తోంది. కానీ ఈ విషయంలో నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios