సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకొని 'స్పైడర్' లాంటి మర్చిపోలేని ఫ్లాప్ సినిమా ఇచ్చాడు దర్శకుడు మురుగదాస్. ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం తనేనని బహిరంగంగా అంగీకరించాడు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'దర్బార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ లతో పాటు లిరికల్ వీడియోలను కూడా విడుదల చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు మురుగదాస్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

'విజిల్' ఎఫెక్ట్ :విజయ్ నెక్ట్స్ ఎంతకి అమ్మారో తెలుసా..?

తెలుగులో ఆయన తీసిన 'స్టాలిన్', 'స్పైడర్' రెండు సినిమాల పరాజయానికి తానే కారణమని అన్నాడు. తెలుగు ప్రేక్షకుల పల్స్ తెలుసుకోలేకపోయానని తెలిపాడు. 'స్పైడర్' విషయంలో మహేష్ ని తమిళ ఆడియన్స్ కి పరిచయం చేయాలనుకున్నానే.. తప్ప తెలుగు ప్రేక్షకులు మహేష్ ని ఎలా చూడాలనుకుంటున్నారో పట్టించుకాలేదని అన్నారు.

ఇక ఎన్టీఆర్ తో సినిమా అంటూ వస్తోన్న వార్తలపై మురుగదాస్ స్పందించాడు. చాలా రోజులు కిందట ఎన్టీఆర్ కి కథ చెప్పిన మాట నిజమేనని అన్నారు మురుగదాస్. అయితే ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదని.. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. త్వరలోనే ఓ తెలుగు సినిమాని డైరెక్ట్ చేయనున్న విషయాన్ని మురుగదాస్ వెల్లడించారు.