దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ గూహరా(28) మృతి చెందారు. ఈమె 'కే పాప్' బ్యాండ్.. 'కారా' సభ్యురాలిగా, గాయనిగా పేరొందింది. గూహరా ఆదివారం నాడు సియోల్ లోని తన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో విగతజీవితగా కనిపించింది.

సాయంత్రం ఆరు గంట,అ సమయంలో ఆమె తన ఇంట్లో మరణించి ఉండటాన్ని గమనించిన పరిచయస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మృతి కారణాలు తెలియలేదని.. ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

మెంటల్ గా టార్చర్ చేశాడు.. ఇలియానా కామెంట్స్!

ఆరు నెలల క్రితం కూడా ఆమె తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. అప్పట్లో ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. పదేళ్ల క్రితం 'కారా' బ్యాండ్ ద్వారా గూహరా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పట్లో కారా బ్యాండ్ బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా యూత్ లో ఈ బ్యాండ్ కి మంచి క్రేజ్ ఉండేది.

కానీ క్రమక్రమంగా బ్యాండ్ క్రేజ్ తగ్గిపోయింది. ఈ క్రమంలో గత ఏడాది రివెంజ్ పోర్నోగ్రఫీ బారిన పడింది గూహరా. దాని కారమగా ఆమె తన మ్యూజిక్ కెరీర్ ని సడెన్ గా ఆపేసింది. తన మాజీ ప్రియుడుగూహరా అతడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బెదిరించాడు. దీంతో అతడిని గూహరా కోర్టుకి లాగింది. కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. ఈ వీడియోల కారణంగానే ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.