ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి ఇలియానా.. విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు అతడితో సహజీవనం చేసింది ఈ బ్యూటీ. ఒకానొక దశలో వీరిద్దరికీ పెళ్లి కూడా అయిపోయిందనే మాటలు వినిపించాయి.

కానీ ఇటీవల ఈ జంట బ్రేకప్ వ్యవహారంతో వార్తల్లో నిలిచాడు. ఇలియానా తన సోషల్ మీడియా ఖాతా నుండి ఆండ్రూతో కలిసి తీసుకున్న ఫొటోలన్నీ తొలగించింది. అలానే అతడి అన్ ఫాలో చేసింది. ఆండ్రూ కూడా తన దేశానికి వెళ్లిపోయాడు. సోషల్ మీడియా నుండి ఆండ్రూకి సంబంధించిన జ్ఞాపకాలు తీసేసినప్పటికీ తను మాత్రం అతడిని అంత సులువుగా మర్చిపోలేకపోయింది.

ఆ జ్ఞాపకాల నుండి బయటకి రావడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక దశలో మానసికంగా చాలా కుంగిపోయానని, తట్టుకోలేక రోజుకి 12 టాబ్లెట్స్ వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అలా  మానసికంగా కూడా తనను ఆండ్రూ చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చింది. వారం రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఇప్పుడు అంతా సెట్ అయిందని తెలిపింది.

ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకోవడం వలన బరువు బాగా పెరిగిపోయినట్లు, తగ్గడానికి జిమ్ కి వెళ్తే ఎక్కడ తన ఫోటోలు తీసి నెట్ లో పెడతారనే భయంతో ఇంట్లోనే ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తనకు తెలిసిన పద్దతుల్లో ఇంట్లోనే అందుబాటులో ఉన్న జిమ్ లో కసరత్తులు చేసి బరువు తగ్గించుకున్నట్లు తెలిపింది ఇలియానా.

ప్రస్తుతం తను జిమ్ కి వెళ్లే పొజిషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బ్రేకప్ తరువాత ఈ బ్యూటీ సినిమాలపై దృష్టి పెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల బాలీవుడ్ లో ఆమె నటించిన 'పాగల్ పంతి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.