ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది తమకంటూ ప్రత్యేకమైన వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. హీరోల భార్యలు, దర్శకనిర్మాతల భార్యలు సొంతంగా బిజినెస్ లు మొదలుపెట్టేశారు.

ఇప్పుడు మంచు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొత్త బిజినెస్ పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. మంచు విష్ణు భార్య విరానికా తన పిల్లల పేరు మీద సొంతంగా కిడ్స్ ఫ్యాషన్ లైన్ ని మొదలుపెట్టబోతున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ ఫ్యాషన్ లైన్ మొదలుకానుంది.

స్కాం చేయడానికి అమెరికా వెళ్లిన మంచు విష్ణు!

ఇందులో చిన్నారులకు సంబంధించిన వివిధ రకాల డిజైన్స్ కలిగిన డ్రెస్ లను అమ్మకానికి పెడతారు. ప్యాన్ ఇండియా లెవెల్ లో ఈ బిజినెస్ ఉంటుందని సమాచారం. మరికొద్దిరోజుల్లో ఈ బ్రాండ్ పేరుని అనౌన్స్ చేయనున్నారు. 'దిమంచుట్విన్స్' అరియానా, వివియానాలకు సోషల్ మీడియాలో పాతిక వేలకి మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

వీరు సరికొత్త డిజైనింగ్ తో కూడిన బట్టలను ధరిస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు వారే సొంతంగా బ్రాండ్ ని మొదలుపెట్టడం విశేషం. అన్ని వర్గాల ప్రజలు కొనగలిగే రేంజ్ లోనే ధరలు ఉంటాయని చెబుతున్నారు. ఇండియాలోనే ఇది బెస్ట్ క్లోతింగ్ కంపనీ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.