యంగ్‌ హీరో మంచు విష్ణు నటిస్తున్న క్రాస్‌ ఓవర్‌ మూవీ 'మోసగాళ్లు'. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేశారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కాం నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ మేజర్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసిన చిత్రయూనిట్‌ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక్కడ చిత్రీకరిస్తోన్న సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం.

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టితో పాటు రుహానీ సింగ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంచు విష్ణు ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కాం చేసిన స్కామర్‌ అర్జున్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.