ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు క్యాబ్ ల కారణంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. డ్రైవర్ అనుచిత, అసభ్య ప్రవర్తన కారణంగా ఎంతోమంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు నటి సోనమ్ కపూర్.

క్యాబ్ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచించారు. లండన్ లో ఉబెర్ క్యాబ్ లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు భయంకరమైన అనుభవం ఎదురైందని.. వణికిపోయానని చెప్పారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లో ప్రయాణం చేయడం అత్యంత శ్రేయస్కరమని చెప్పారు.  

సంక్రాంతి మాయ... యావరేజ్ సినిమాకైనా.. కోట్లు రాలాల్సిందే!

క్యాబ్ డ్రైవర్ తనపై విపరీతంగా అరిచాడని.. దాంతో క్యాబ్ దిగిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొందరు సోనమ్ ట్వీట్ కి సానుకూలంగా స్పందించగా.. మరికొందరు లండన్ లో ఉబెర్ సేవలపై గతంలో నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మరికొందరు క్యాబ్ ల కారణంగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న సోనమ్.. అక్కడకి వెళ్లిన క్రమంలో బ్రిటీష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంతో సదరు సంస్థ తీరు బాలేదని మండిపడ్డారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ గతంలో రెండు సార్లు తన బ్యాగ్ పోగొట్టిందని.. మరోసారి ఈ ఎయిర్ వేస్ లో ప్రయాణించనని స్పష్టం చేసింది.