దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన నటి సోనాలి బింద్రే తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా గడిపిన ఈ భామ తాజాగా మీడియాతో ముచ్చటించింది.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు. డబ్బులు సంపాదించడం కోసమే తాను సినిమాల్లోకి వచ్చానని.. సినిమాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఈ వృత్తి ఎంతగానో నచ్చిందని.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సినిమా పరిశ్రమ చాలా అధ్బుతమైన ప్రదేశమని అన్నారు.

అమెజాన్ ప్రైమ్ కి పోటీగా అల్లు అరవింద్, కొత్త యాప్ వచ్చేసింది!

ఈ పరిశ్రమలోనే కుటుంబ సభ్యులతో పాటు ఎందరో స్నేహితులను సొంతం చేసుకున్నానని అన్నారు. బాలీవుడ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమనేది.. తనకు జరిగిన ఓ అధ్బుతమని.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు.. కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించిందని పేర్కొన్నారు.

సోనాలికి పుస్తకాలంటే చాలా ఇష్టమని.. చిన్నప్పటి నుండి పుస్తకాలు తనకు మంచి స్నేహితులను ఆమె తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఫారెన్ కి వెళ్లినప్పుడు పుస్తకాలకు మరింత దగ్గరయ్యానని చెప్పారు. ఆ సమయంలో చదివిన 'ఏ జెంటిల్మేన్ ఇన్ మాస్కో' అనే సినిమా తనలో ధైర్యం నింపిందని చెప్పారు.