డిస్ట్రిబ్యూటర్ గా, ప్రముఖ నిర్మాతగా పేరున్న అల్లు అరవింద్ ..ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తెలుగు సినిమా ప్రపంచాన్ని శాసిస్తున్న ఓటీటి ప్లాట్ ఫామ్ లోకి ఆయన వచ్చేసారు. ఇప్పటికే  అమెజాన్- నెట్ ఫ్లిక్స్- హాట్ స్టార్ వంటి ఓటీటి ప్లాట్ ఫామ్ లు తెలుగు వారికి దగ్గరయ్యాయి. ఇప్పుడు అల్లు అరవింద్ తనదైన సొంత మార్కెటింగ్ స్ట్రాటజీతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేసారు. అరవింద్ సొంత ఓటీటీ `ఆహా` పేరుతో లాంచ్ చేసారు. ఆహా యాప్ గూగుల్ ప్లేస్టోర్ లోనూ ఉచితంగా అందుబాటులో ఉంచారు.

ఈ కొత్త ఓటీటి ప్లాట్ ఫామ్ పై అనేక టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్ని స్ట్రీమింగు కి రెడీ చేశారు. ప్రస్తుతానికి ఇందులో సినిమాల్ని ఉచితం గా చూసే వెసులుబాటును కల్పించారు. మెల్లిగా అలవాటయ్యాక నెలవారీ ఫీజును..సంవత్సర ఫీజును నిర్ణయిస్తారని సమాచారం. ఇన్నాళ్లు తమ సినిమాల డిజిటల్ రైట్స్ ని అమెజాన్ కు విక్రయించారు. ఇకపై గీతా ఆర్ట్స్  సొంత ఓటీటీ వేదికలపైనే సొంత సినిమాల్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

అందుతున్న సమాచారం మేరకు అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లతో పోటీపడుతూ ఈ ఓటీటిని  రన్ చేయాలన్నది అల్లు అరవింద్ అలోచన. అలాగే ఈ ఓటీటి ఫ్లాఫ్ ఫామ్ కోసం  ఓ కొత్త కంపెనీ స్టార్ట్ చేసారు. అర్హ మీడియా బ్రాడ్ కాస్టింగ్ ప్రెవేట్ లిమిటెడ్ తో ఈ డిజిటెల్ స్పేస్ లోకు ఎంటర్ అవుతున్నారు. అర్హ అనేది అల్లు అర్జున్ కుమార్తె పేరు కావటం విశేషం. అయితే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ ఈ రెండు కూడా దాదాపు పాతుకుపోయాయి. వీటితో పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు. కానీ అల్లు అరవింద్ తన పరిచయాలతో , ఇండస్ట్రీ మీద ఉన్న పట్టుతో ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని రన్ చేయనున్నారు.