ప్రముఖ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రూలర్ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన వేదిక ,సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీ కళ్యాణ్ సినిమాని నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సోనాలి చౌహాన్ లాస్ట్ మినిట్ లో బయటకు వెళ్లిపోయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  

దర్శక,నిర్మాతలతో వచ్చిన విభేధాలతో ఆమె ఈ సడెన్ డెసిషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే మరి ఆమెతో చేయాల్సిన సీన్స్ బాలెన్స్ ఉన్నాయని.. సోనాల్ స్థానంలో.. మరో హీరోయిన్‌ని తీసుకుని.. ఇప్పటికప్పుడు.. మళ్లీ రీ షూటింగ్ చేసి.. ఎడిట్ చేయాలన్నా.. చాలా సమయం పడుతుంది డిస్కషన్స్ జరుగుతున్నాయి.

టైటానిక్ హీరోని కదిలించిన ఢిల్లీవాసుల ఆవేదన..!

రిలీజ్ టైం దగ్గరపడుతున్న ఈ సమయంలో.. నిర్మాత..ఈ సమస్యని అథిగమించి సినిమాని పూర్తి చేయగలరా..? అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్న నేపధ్యంలో .. ఇది రూమరే అంటూ ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ స్పందించారు. ఇది కేవలం మీడియాలో పుట్టిన రూమర్‌ మాత్రమే అని.. సోనాల్ చౌహాన్ షూటింగ్‌లో ఉందని.. డిసెంబర్ 28 కన్నా ముందే.. అంటే డిసెంబర్ 20నే ఖచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని.. ఆయన చెప్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఎప్పుడు కనిపించని న్యూ లుక్ లో బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించటంతో మంచి క్రేజ్ వచ్చింది.  బాలకృష్ణ ఓ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు.  ఈ సినిమాకి చిరంతన్ బట్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.  డిసెంబర్ 20 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
 
ఈ రోజు ( గురువారం) సాయంత్రం 4:28 గంట‌ల‌కు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈసినిమా కోసం బాల‌కృష్ణ బ‌ర‌వు త‌గ్గి యంగ్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన పోస్టర్స్‌లోని బాల‌కృష్ణ లుక్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి.