సోనాక్షి సిన్హా కెరీర్ బాలీవుడ్ లో దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. యంగ్ హీరోలెవరూ ఆమెను తమ సరసన తీసుకోవటం లేదు. సీనియర్ హీరోలకు అంత సీన్ ఉండటం లేదు. ఆమె ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని సల్మాన్ సరసన దబాంగ్ 3 డిజాస్టర్ అవటం ఆమెను నిరాశలో ముంచేసింది. బాలీవుడ్ తలుపులు దాదాపు మూసుకుపోయాయని అర్దమైంది. ఈ నేపధ్యంలో ఆమె దృష్టి దక్షిణాదిపై పడింది. అప్పట్లో రజనీకాంత్ చిత్రం లింగా లో కనిపించిన ఆమె ఆ తర్వాత మళ్లీ ఇక్కడ అడుగు పెట్టలేదు. అయితే ఇప్పుడు ఆమె తెలుగులో చేయటానికి ఉత్సాహం చూపిస్తోంది.

దాంతో బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్ చిత్రం కోసం ఆమెను హీరోయిన్ గా అడగటం జరిగిందని సమాచారం. అయితే రెమ్యునేషన్ సమస్యతో ఆమె ఈ ప్రాజెక్టుని వద్దనుకుందని సమాచారం. అయితే అదే సమయంలో క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబో లో రూపొందనున్న చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. సోనాక్షి కనుక ఈ ప్రాజెక్టు సైన్ చేస్తే ఇదే తెలుగులో ఆమె తొలి చిత్రం అవుతుంది. పీరియడ్ డ్రామాగా రూపొందే ఆ చిత్రంలో ఆమె పాత్ర ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుందని చెప్తున్నారు.

రాజమౌళి సినిమాలో శ్రీయ.. ఆమె రోల్ ఇదేనా?

ఇక సల్మాన్ చేసిన దబంగ్ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైంది బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఈమె సినిమాలో ఉంటే  హిట్ అనే సెంటిమెంట్ తో నడిచిపోయింది. కాని అనుకున్నట్లుగా ఆమె కెరీర్ సాగలేదు. వరస డిజాస్టర్స్ ఆమెను దెబ్బకొట్టాయి. స్టార్స్ సరసన ఆఫర్స్ రాకపోవటంతో  అందాల ఆరబోతలో కూడా హద్దులు దాటేస్తూ..హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయినా పెద్దగా ఫలితం కనపడలేదు.