నందమూరి బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం రూలర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ నెక్స్ట్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అఫీషియల్ గా గత వారమే పూజ కార్యక్రమాలతో సినిమాని లాంచ్ చేశారు.

అయితే ఆ సినిమాకు సంబందించిన రూమర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ముఖ్యంగా సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ వచ్చింది. దాదాపు ఫిక్స్ అయినట్లే అని అలాగే మరొక హీరోయిన్ ని కూడా బోయపాటి సెలెక్ట్ చేసినట్లు రూమర్ వచ్చింది. ఇక ఆ రూమర్స్ పై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

హీరోల రేంజ్ లో విలన్స్ జీతాలు.. పని తక్కువైనా ఆదాయం ఎక్కువే

దీంతో డైరెక్ట్ సోనాక్షి సిన్హా రంగంలోకి దిగి అందరికి షాక్ ఇచ్చింది.  "బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాలో నేను నటిస్తున్నట్లు వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. త్వరలోనే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తాను" అని సోనాక్షి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దీంతో సినిమాలో హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ వచ్చేసింది.

గతంలో కూడా ఒక తెలుగు సినిమాలో ఈ దబాంగ్ బ్యూటీ ముఖ్య పాత్రలో నటించనుందని టాక్ వచ్చింది. కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ సోనాక్షి టాలీవుడ్ లో సినిమాలు చేయనని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ రూమర్స్ డోస్ పెరగకముందే అప్పుడు కూడా సోనాక్షి స్పందించి అవన్నీ అబద్ధాలని కొట్టి పారేసింది. మరి బోయపాటి సినిమాలో బాలయ్య సరసన ఎవరు రొమాన్స్ చేస్తారో చూడాలి.