ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేసిన హీరోయిన్ తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. అయితే తనతో కలిసి నటించడానికి కొందరు హీరోలు ఒప్పుకోలేదని తాప్సీ స్వయంగా ప్రకటించింది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తాప్సీ నటించిన 'తప్పడ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో తాప్సీ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. సినిమా విడుదల సందర్భంగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

భర్త కోసం మరొక కథను రెడీ చేయిస్తున్న సమంత!

కొందరు హీరోలు తనతో నటించడానికి కూడా అంగీకరించలేదని.. ఎందుకంటే తనతో కలిసి నటిస్తే అందరి దృష్టి వారిపై కంటే తన మీదే పడుతుందని.. హీరోలను ఎవరూ పట్టించుకోరనే అభద్రతా భావమని.. ఆ భయంతోనే తనతో కలిసి నటించడానికి హీరోలు ముందుకు రాలేదని చెప్పింది.

అలా భయపడిన హీరోల్లో కేవలం ఒకట్రెండు సినిమాలు చేసిన వాళ్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. హీరోయిన్ల ప్రాధాన్యం ఉన్న సినిమాలకు తక్కువ బడ్జెట్ లో సరిపెట్టవచ్చని.. ఒక హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ మొత్తంతో సినిమానే తీయోచ్చని అన్నారు.

హీరోయిన్లు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించినప్పుడు మాత్రమే పరిశ్రమలో మార్పు వస్తుందని అన్నారు. అయితే తనతో నటించనని చెప్పిన హీరోలెవరనే విషయాన్ని తాప్సీ బయటపెట్టలేదు.