టాలీవుడ్ స్టార్ కపుల్స్ నాగ చైతన్య - సమంత మరొక సినిమాతో వేడితెరపై కనిపించనున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గాని సమంత నాగ చైతన్య కోసం కొత్త తరహా కథలను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మజిలీ సినిమాతో తన భర్తకు మర్చిపోలేని విజయాన్ని అందించింది సమంత.

అంతకు ముందు వరకు వరుస అపజయాలతో సతమతమైన చైతు ఆ సినిమాతోనే ట్రాక్ లోకి వచ్చాడు. అలాగే తన మార్కెట్ ని కూడా పెంచుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. చైతు వెంకీ మామ తో అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి, అయితే ఆ సినిమా తరువాత నాగ చైతన్య నందిని రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సమంతఓ బేబీ సినిమాను డైరెక్ట్ చేసి మంచి విజయాన్ని అందించిన నందిని రెడ్డికి సమంత మరొక అఫర్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది. తన భర్త కోసం ఒక మంచి కథ ఉంటే రెడీ చేయమని చెప్పిందట. అయితే అందులో సమంత నటిస్తుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పరశురామ్ ప్రాజెక్ట్ తరువాత చైతు నందిని రెడ్డితో సినిమాను స్టార్ట్ చేయవచ్చని టాక్.