సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు అందుకున్న తేజు ఆ తర్వాత డీలా పడ్డాడు. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు తేజు కెరీర్ ని ఇబ్బంది పెట్టాయి. కానీ చిత్రలహరి చిత్రంతో మళ్ళీ పుంజుకున్నాడు. గత ఏడాది విడుదలైన ప్రతిరోజూ పండగే చిత్రం కూడదా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో తేజు మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పయనిస్తున్నాడు. 

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. డెబ్యూ డైరెక్టర్ సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరోసారి తమన్ తేజు చిత్రానికి సంగీతం అందిస్తున్న చిత్రం ఇది. వాలంటైన్స్ డేని పురస్కరించుకుని చిత్ర యూనిట్ థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసింది. కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ సాంగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. 

న్యూడ్ పిక్ పోస్ట్ చేసిన 'నువ్వు నేను' హీరోయిన్.. భర్తపై హాట్ కామెంట్స్

సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ పాటకు మంచి మ్యూజిక్ అందించాడు. వాలంటైన్స్ డే రోజున సింగిల్స్ కి ఈ సాంగ్ మంచి కిక్కిస్తుందని చెప్పొచ్చు. సాయిధరమ్ తేజ్ స్పీచ్ తరహాలో ఈ సాంగ్ సాగుతుంది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ తన కాలేజ్ మేట్స్ కు సాయిధరమ్ తేజ్ మెసేజ్ అందిస్తున్నాడు. తేజు ప్రసంగిస్తున్న వేదికపై వివాహం చేసుకోకుండా గొప్పవాళ్లుగా ఎదిగిన మదర్ థెరెసా, వాజ్ పేయి, ఆర్ నారాయణమూర్తి, అబ్దుల్ కలాం లాంటి వారి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. 

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై అత్తారింటికి దారేది ఫేమ్ బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. వీడియో సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..