సాధారణంగా సినిమా ప్రారంభం టైమ్ లో ఓ బడ్జెట్ అనుకుంటారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో ఎంతో కొంత పెరుగుతుంది. అయితే అది సీనియర్ నిర్మాతలకు తెలుసు కాబట్టి దాన్ని అంచనా వేసి, ఎక్కడ బడ్జెట్ తగ్గించాలో ప్లాన్ చేసుకుని ఎడ్జెస్ట్ మెంట్ చేసుకుని ముందుకు వెళ్తారు. అయితే ఇలాంటి విషయాల్లో కొత్త నిర్మాతలు దొరికిపోతూంటారు. డైరక్టర్స్ ప్రాజెక్టు ఓకే అవటం కోసం వేసిన బడ్జెట్... ఆ తర్వాత పెరగటం చూసి ఏం చేయాలో అర్దకాక, ఎలాగోలా మొదలెట్టిన సినిమా పూర్తి చేయాలని,మధ్యలో వదిలేస్తే మొత్తం మునిగిపోతామని పూర్తి చేసి రిలీజ్ చేస్తూంటారు. దాదాపు అలాంటి అనుభవమే...రీసెంట్ గా వచ్చిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ నిర్మాత శేఖర్ రాజు కు జరిగిందని ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో  చెప్పుకొచ్చారు.

శేఖర్ రాజు మాట్లాడుతూ... మొదటి నుంచీ నాకు సినిమాలు నటనపై ఇంట్రస్ట్ ఉండేది. ఓసారి సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీ దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల వచ్చి నాకు కథ చెప్పి.. మీరు తీస్తే బాగుంటుందని, అందులో మీరు ఓ రోల్ చేస్తే బాగుంటుందని చెప్పారు. సరే అన్నాను. ఈ సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు దర్శకుడు నాకు చాలా తక్కువ బడ్జెట్ అవుతుందని చెప్పాడు. నిజానికి అప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు.

సుడిగాలి సుధీర్ సినిమాకి రూ.5 కోట్లు.. అంత సీన్ ఉందా..?

సినిమా ప్రారంభం అయిన తరువాత బడ్జెట్‌ను పెంచుకుంటూ వెళ్లారు. మొదట్లో చెప్పిన దానికి ఐదు రెట్లు పెంచుకుంటూ వెళ్లారు. చివరకు డబ్బులు విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. అంతేకాదు లాస్ట్ కు వచ్చేసరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విపరీతంగా బడ్జెట్ పెంచేశారు. బడ్జెట్ ఐదురెట్లు పెరగడంతో బ్యాంక్ లోన్  తీసుకుని మరీ సినిమాను రిలీజ్ చేశా అని చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా పరిచయమయిన చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటించగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రం రిలీజైన రోజే ఫ్లాఫ్ సినిమాగా నమోదు చేసుకుంది. ఓ మాదిరి ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేక చతికిలపడింది. బుల్లి తెరపై నాన్ స్టాప్ గా నవ్వులు పంచే సుడిగాలి సుధీర్ హీరోగా వెండి తెరపై వర్కవుట్ కాలేదు.