బుల్లితెరపై వ్యాఖ్యాతగా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 'జబర్దస్త్' షోతో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తూ బుల్లితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన సుధీర్.. అదే మ్యాజిక్ వెండితెరపై కూడా రిపీట్ చేయాలని చూశాడు.

ఈ క్రమంలో 'సాఫ్ట్ వేర్ సుధీర్' అంటూ ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా సుధీర్ అభిమానులను నిరాశ పరిచింది. కానీ నిర్మాత మాత్రం మరో విధంగా చెబుతున్నాడు. తనకు ఈ సినిమాతో భారీగా లాభాలు వచ్చాయని నిర్మాత శేఖర్ రాజు అంటున్నారు.

మహేష్, సుకుమార్ లలో ఎవరు తగ్గారు.. లిస్ట్ లో అతడు కూడా!

సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన శేఖర్ రాజు.. దాదాపు మూడు కోట్ల బడ్జెట్ తో సినిమాని నిర్మించారు. బయ్యర్లు లేకపోవడంతో సీడెడ్, నైజాంలో సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. కేవలం సుధీర్ కి ఉన్న ఇమేజ్ తో సినిమాని రిలీజ్ చేశారు. రాజశేఖర్ పులిచర్ల రూపొందించిన ఈ సినిమాకి తొలిరోజే నెగెటివ్ టాక్ వచ్చింది.

పాత కథ, కథనాలతో సినిమా విసిగించిందని.. సుధీర్ తప్ప సినిమాలో చూడడానికి ఏమీ లేదనే కామెంట్స్ వినిపించాయి. మొదటివారంలో ఈ సినిమా కోటి రూపాయల షేర్ కూడా తీసుకురాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. బుల్లితెరపై సుధీర్ కి ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొచ్చేలా చేసింది.

తొలిరోజు ఈ సినిమాకి ముప్పై కోట్ల వరకు షేర్ వచ్చిందని తెలుస్తోంది. అయితే రెండో రోజు నుండి మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కోటి రూపాయలు కూడా రాలేదని టాక్. సినిమాని కొనుక్కున బయ్యర్లు నష్టపోయారు.

కానీ నిర్మాత శేఖర్ రాజు మాత్రం తనకు దాదాపు రూ.5 కోట్ల వరకు లాభాలు వచ్చాయని చెబుతున్నారు. అంతేకాదు.. సుధీర్, రష్మిలతో సినిమా చేస్తానని అంటున్నారు. ఈ తప్పుడు లెక్కలు ఎందుకు చెప్తున్నారో నిర్మాతకే తెలియాలి!