ఆరడుగుల ఆజానుబాహుడు, హ్యాండ్సమ్ లుక్ తో ఆకట్టుకునే హీరో యష్ కెజిఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు యష్ కన్నడలో స్టార్ హీరోనే. కానీ కెజిఎఫ్ చిత్రమే యష్ సూపర్ స్టార్ డమ్ కు కారణం అయింది. ప్రస్తుతం యష్ అభిమానులంతా కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉండగా హీరో యష్ కేంద్రగా గత ఏడాది మార్చిలో జరిగిన కొన్ని సంఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. భరత్ అలియాజ్ స్లమ్ భరత్ అనే రౌడీ మోస్ట్ డెంజరస్ రౌడీ షీటర్ గత ఏడాది యష్ హత్యకు ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా స్లమ్ భరత్ పోలిసుల చేతిలో హతమయ్యాడు. 

భరత్ పై మర్డర్ కేసు, ఇతర వ్యవహారాల్లో మొత్తం 50 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొంత కాలంగా భరత్ పరారీలో ఉన్నాడు. ఇటీవలే భరత్ ని ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసి పోలీసులు కర్ణాటనకు తీసుకువచ్చారు. సీన్ రీ కంస్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై భరత్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భరత్ ఓ పోలీస్ పై కాల్పులు జరపగా బులెట్ అతడికి తగిలింది. పోలీస్ బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వాళ్ళ హాని జరగలేదు. మరో బులెట్ పోలీస్ వ్యానుని తాకింది. 

మరో వాహనంలో భరత్ పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని ఛేజ్ చేసి మరోసారి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ బుల్లెట్ పొత్తి కడుపులోకి దూసుకుపోయింది. మరో బుల్లెట్ కాలికి తగిలింది. దీనితో పోలీసులు భరత్ ని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సప్తగిరి ఆసుపత్రి నుంచి విక్టోరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికి తీవ్రంగా రక్తస్రావం కావడం, పరిస్థితి విషమించడంతో భరత్ మృతి చెందాడు. 

47 ఏళ్ల హాట్ ఆంటీ.. చీర, బికినీ ఏదైనా ఈమె ఫిజిక్ కు ఫిదా కావాల్సిందే

ఇక హీరో యష్ హత్యకు కుట్ర విషయానికి వస్తే.. గత ఏడాది మార్చి 7న కర్ణాటక పోలీసులు రౌడీ షీటర్ భరత్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. యష్ పై హత్యకు కుట్ర పన్నినందువల్లే భరత్ అని అరెస్ట్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ ఊహాగానాలు ఎక్కువవుతుండడంతో యష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలని ఖండించాడు. తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని, ఎవరి నుంచి తనకు థ్రెట్ లేదని క్లారిటీ ఇచ్చాడు. 

అక్కడ సెక్స్ సీన్లు ఇక్కడ వద్దు.. నితిన్ భయం అదే!

ఎవరో వచ్చి హత్య చేసేందుకు తనేం గొర్రెని కాదని కూడా యష్ పేర్కొన్నాడు. ఈ వార్తలు తనని, తన ఫ్యామిలీని బాధిస్తున్నాయని, ఇలాంటి వార్తలు ప్రచురించేముందు నిజా నిజాలు తెలుసుకోవాలని యష్ మీడియాకు రిక్వస్ట్ చేశాడు. ఆ సమయంలో తాను అప్పటి హోమ్ మినిష్టర్ ఎంబి పాటిల్, రాష్ట్ర డీజీపీతో ఈ విషయం గురించి చర్చించానని తెలిపాడు. వాళ్ళు కూడా తనకు ఎలాంటి థ్రెట్స్ లేవని క్లారిటీ ఇచ్చినట్లు మార్చి 2019 మీడియా సమావేశంలో యష్ క్లారిటీ ఇచ్చాడు. 

మొత్తంగా రౌడీ షీటర్ భరత్ వల్ల యష్ అప్పట్లో తనకు సంబంధం లేని వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆ క్రిమినల్ భరత్ పోలిసుల చేతిలో ఎన్కౌంటర్ అయ్యాడు.