తమిళ నటుడు, దర్శకుడు ఎస్.జె.సూర్య తెలుగు వారికి కూడా సుపరిచితుడే. పవన్ కళ్యాణ్ తో 'ఖుషి' సినిమా తీసిన సూర్య.. మహేష్ బాబు నటించిన 'స్పైడర్' సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈ మధ్యకాలంలో ఎస్.జె.సూర్య.. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కి ప్రపోజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కోలీవుడ్ లో ఈ వార్త బాగా ప్రచారమైంది. గతంలో వీరిద్దరూ కలిసి 'మాన్‌స్టర్' అనే సినిమాలో నటించారు. ఇప్పుడు మరో సినిమా కోసం కలిసి పని చేయబోతున్నారు.

'ముప్పావలా' పోస్టర్ పై పవన్ ఫ్యాన్స్ మండిపాటు.. వర్మ వివరణ!

ఈ క్రమంలో ప్రియతో సూర్య ప్రేమలో పడ్డాడని, సెట్స్ లోనే ఆమెకి ప్రపోజ్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం రోజురోజుకి పెరిగిపోతుండడంతో ఎస్.జె.సూర్య ఆగ్రహానికి లోనయ్యారు. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తను ప్రియాంక భవానీ శంకర్ కి ప్రపోజ్ చేశానని.. కానీ ఆమె రిజెక్ట్ చేశారని కొందరు ఇడియట్స్ తప్పుడు వార్తలు క్రియేట్ చేశారని అన్నారు.

ప్రియా భవానీ శంకర్ తనంకు మంచి స్నేహితురాలని.. అంతకుమించి సిన్సియర్ నటి అని.. ఆధారాలు లేని ఇలాంటి వార్తలు పుట్టించి చిరాకు తెప్పించకండి అంటూ ఘాటుగా స్పందించాడు. ఈ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు ఇలాంటి వార్తలు పట్టించుకోవద్దని.. వర్క్ మీద దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.