ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా గోడకు ఎక్కారు. ఈ మధ్యన ఆయన తెరకెక్కించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా వర్కవుట్ అయ్యిందా లేదా అనే సంగతి అటుంచితే... రాజకీయంగా ఈ సినిమాపై  జరిగిన రచ్చ మాత్రం అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో, వర్మ నెక్స్ట్ మూవీ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు.

టైటిల్  ఏమిటనే దానిపై గత కొద్ది రోజులుగా ఆసక్తి నెలకొంది. ఖచ్చితంగా మరో వివాదాస్పద అంశాన్నే వర్మ ఎంపిక చేసుకుంటాడని అందరూ నమ్ముతున్న టైమ్ లో ఓ పోస్టర్ అందరి దృష్టికీ వచ్చింది.

కంటతడి పెట్టిన హీరోయిన్.. కాళ్లపై పడ్డ ఆర్జీవీ

ఆ పోస్టర్ నిజమే అన్నట్టుగా...వర్మ పేరిట ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ లో ఏముందంటే... తన కొత్త సినిమాను ప్రకటిస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉంది. తన తదుపరి చిత్రం 'ముప్పావలా' అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ఆ పోస్టర్, టైటిల్  జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెటకారం చేస్తున్న కథాంశంతో సినిమా వస్తున్నట్టు  చాలా క్లియర్ గా ఉంది. ఇది సెన్సేషన్ గా మారింది.

పవన్ ఫ్యాన్స్ అయితే ఓ రేంజిలో వర్మను తిట్టి పోస్తున్నారు.  అయితే ఈ పోస్టర్ వాస్తవానికి వర్మ షేర్ చేయలేదట. ఆయనకు అసలు అలాంటి ఆలోచన లేదట. ఎవరో ఆయన పేరున మార్ఫింగ్ చేసి వదిలారట. అంటే వర్మకే ఎవరో ట్వీట్ ట్విస్ట్ ఇచ్చారన్నమాట.

ఈ  విషయమై  రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ ట్వీట్ తనది కాదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మార్ఫింగ్ చేసిన ఇమేజ్ తో దాన్ని ఎవరో పోస్ట్ చేశారని... దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. కావాలనుకుంటే ఎవరైనా సరే తన ట్వీట్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చని అన్నారు.