స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

ఈ పండగ సీజన్‌లో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో పాటలు ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఓ మై గాడ్ డాడీ', 'సామజవరగమన', 'బుట్ట బొమ్మ', టైటిల్ సాంగ్ ఇలా ప్రతీ ఒక్కటి యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

'అల వైకుంఠపురములో' బన్నీ స్టైల్ కి కుర్ర హీరో ఫిదా

అయితే ఈ పాటలన్నీ ఒకెత్తయితే.. 'సిత్తారాల సిరపడు' పాట ఒకెత్తు. సినిమా చూసిన వారందరికీ ఈ పాట సర్ప్రైజింగ్ గా అనిపించింది. క్లైమాక్స్ లో హీరో.. విలన్స్ తో ఫైట్ చేసే సమయంలో ఈ పాట వినిపిస్తుంది. అప్పటివరకు ఈ పాట ఒకటి సినిమాలో ఉందని చాలా మందికి తెలియదు. కానీ ప్రమోషన్స్ సమయంలో త్రివిక్రమ్ సినిమాలో ఒక 
సర్ప్రైజింగ్ సాంగ్ ఉంటుందని, ఆడియన్స్ ని అలరిస్తుందని చెప్పారు.

నిజంగానే ఈ పాట ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమా చూసిన తరువాత యూట్యూబ్ లో చాలా మంది ఈ పాట గురించి వెతికారు. తాజాగా ఈ లిరికల్ సాంగ్ ని చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పాట కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటకి విజయ్ కుమార్ భల్లా లిరిక్స్ అందించగా.. సూరన్న, సాకేత్ కొమండూరి కలిసి పాడారు. తమన్ సంగీతం అందించారు.