అల.. వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన బన్నీ మంచి సినిమాతో హిట్టందుకొని అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. అయితే బన్నీ అందుకున్న సక్సెస్ కు చాలా మంది సినీ ప్రముఖులు వారి స్టైల్ లో విషెస్ అందిస్తున్నారు. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు మరో యువ హీరో కూడా చేరాడు.  అఃనెవరో కాదు.

లవర్ బాయ్ శర్వానంద్. అల్లు అర్జున్ కి శర్వా మంచి స్నేహితుడు. అయితే ఇటీవల సినిమాని వీక్షించిన శర్వా స్టైలిష్ స్టార్ పై ప్రశంసలు కురిపించాడు. సినిమా అద్భుతంగా ఉందని తెరపై బన్నీని చూసి చాలా నేర్చుకున్నాను అని చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెష్ అందించారు. ఇక బన్నీ కూడా శర్వా కామెంట్స్ పై పాజిటివ్ గా స్పందించారు.  మై డియర్ శర్వా సినిమాని అభినందించినందుకు చాలా థ్యాంక్స్. నా నటనను, సినిమాని ఇష్టపడినందుకు చాలా హ్యాపీగా ఉందని బన్నీ ట్వీట్ చేశాడు.

ఇకపోతే  ప్రస్తుతం సినిమాకు సంబందించిన కలెక్షన్స్ రేంజ్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.71 కోట్ల నుండి 74 కోట్ల వరకు షేర్ రాబట్టిందని సమాచారం. మల్టీప్లెక్స్ లలో సినిమాకి క్రేజ్ పెరిగిపోతుండడంతో థియేటర్ల సంఖ్య పెంచుతున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఒకరోజు ముందుగానే విడుదలైనా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా మాత్రం 'అల.. వైకుంఠపురములో' కలెక్షన్స్ టాప్ రేంజ్ లో ఉందని ట్రేడ్ టాక్. నాల్గో రోజు కూడా ఈ సినిమా దూకుడు ప్రదర్శించింది.

తమిళనాడులో కూడా అదే యుద్ధం.. మహేష్ vs బన్నీ!