బన్నీ కుదురుగా నిలబడితే పాట రాస్తానని చెప్పా.. సిరివెన్నెల

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 6న చిత్రయూనిట్ భారీగా మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొని చిత్రబృందాన్ని విష్ చేశారు. 
 

sirivennela seetharamashastry speech at ala vaikunthapurramloo movie musical concert

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది.

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 6న చిత్రయూనిట్ భారీగా మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా.. ఈ సినిమాలో 'సామజవరగమనా' అనే అధ్బుతమైన పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ఈ సినిమా డబుల్ బొనంజా.. ఈ ప్రీరిలీజ్ వేడుక సూపర్ హిట్ లా ఉంది.. ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు.

పెద్దింట్లో పుట్టామనే యాటిట్యూడ్ బన్నీకి ఉండదు : సునీల్

'అల.. వైకుంఠపురములో' అనే అందమైన పేరుని త్రివిక్రమ్ పెట్టాడని అన్నారు. సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం అన్ని కలగలిపిన ఈ వేడుక సరస్వతీ స్వరూపాన్ని కళ్లజూపిస్తుందని అన్నారు. తనకు చాలా ఇష్టమైన వ్యక్తి బన్నీ అని అతడి సంస్కారం అధ్బుతంగా ఉంటుందని అన్నారు. బన్నీకి చాలా తక్కువ పాటలు రాశానని అన్నారు. అల్లు అరవింద్ తో చాలా సార్లు.. మీ అబ్బాయి కుదురుగా నిలబడితే పాట రాస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.. ఎందుకంటే బన్నీ విద్యుత్ తీగలా నర్తిస్తూనే ఉంటాడని.. ఆ సమయంలో అతడిని కళ్లుచెదిరి చూడడం తప్ప మాటలు ఎలా రాస్తానని అల్లు అరవింద్ అన్నానని చెప్పుకొచ్చారు.

అల్లు అరవింద్ ముగ్గురు పిల్లలు ఆణిముత్యాల్లాంటి వారని అన్నారు. సంగీతానికి భాష లేదన్నట్లుగా ఈ పాటను పదమూడు కోట్ల మంది విన్నారని.. అన్ని దేశాల వారు ఈ పాటని విని ఉంటారని అన్నారు. త్రివిక్రమ్ కి తనకు ఎలాంటి పాటలు కావాలో మంచి స్పష్టతతో ఉంటాడు. 'సామజవరగమనా' అనే మాట త్రివిక్రమ్ చెబితేనే అక్కడ నుండి పాట రాయడం మొదలుపెట్టినట్లు గుర్తు చేసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios