స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 6న చిత్రయూనిట్ భారీగా మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.

'పులొచ్చింది.. మేక సచ్చింది'.. 'అల వైకుంఠపురములో' ట్రైలర్ అదుర్స్!

ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా నటుడు సునీల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఎలా ఉంటుందంటే.. పండగ పూట మీరొక టికెట్ కొనుక్కొని థియేటర్ కి వెళ్తే.. మేమందరం కలిసి మీ ఇంటికి వచ్చినట్లు ఉంటుందని చెప్పారు.

త్రివిక్రమ్.. సునీల్ అనే జత బట్టలు కొన్నాడని .. కొన్నాడు కాబట్టి వేసుకోవాలని సో.. తను తీస్తున్న ప్రతీ సినిమాలో అందులో తనను పడేస్తున్నాడని అన్నారు. అల్లు అర్జున్ కి పెద్దింట్లో పుట్టామనే యాటిట్యూడ్ ఉండదని అన్నారు.

'పరుగు' సినిమా సమయంలో బన్నీ క్యారవాన్ లోనే ఉండేవాళ్లమని..హీరోతో కలిసి అతడి క్యారవాన్ లో ఉండడం అదే మొదటిసారని చెప్పారు. అందరినీ చాలా కంఫర్టబుల్ గా ఉంచేవారని బన్నీపై పొగడ్తల వర్షం కురిపించారు. పండగకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఖాయమని అన్నారు.