Asianet News TeluguAsianet News Telugu

'భీష్మ' ఫస్ట్ సాంగ్.. నితిన్ సింగిల్ లైఫ్ కష్టాలు!

తాజాగా ఈ సినిమాలో మొదటి పాటని రిలీజ్ చేశారు. 'సింగిలే ఐయామ్ రెడీ టు మింగిలే' అంటూ సాగిన ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ పాటకి శ్రీ లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 

singles anthem lyrical song from Bheeshma
Author
Hyderabad, First Published Dec 27, 2019, 4:38 PM IST

యంగ్ హీరో నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీష్మ. సింగిల్‌ ఫరెవర్‌ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌.  ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలో మొదటి పాటని రిలీజ్ చేశారు. 'సింగిలే ఐయామ్ రెడీ టు మింగిలే' అంటూ సాగిన ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ పాటకి శ్రీ లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

ఎగిరి గంతేసిన హీరోయిన్.. జూ.ఎన్టీఆర్ పై ముద్దుల వర్షం!

'సింగిల్ ఆంథమ్' గా ఈ పాటని ప్రమోట్ చేస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ పాట తనకు ఎంతో ఇష్టమైన పాట అని హీరోయిన్ రష్మిక పోస్ట్ పెట్టింది.

కానీ ఈ పాటలో తనను పెట్టుకోలేదని దర్శకుడు వెంకీ, హీరో నితిన్ తో సోషల్ మీడియాలో గొడవకి దిగింది. ప్రస్తుతం చిత్రబృందం పాటల చిత్రీకరణ కోసం రోమ్ కి వెళ్లింది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో రెండు పాటలు చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

 

Follow Us:
Download App:
  • android
  • ios