ప్రముఖ గాయని సునీత కరోనా వైరస్ కారణంగా చేదు అనుభవం ఎదుర్కొంది. సింగర్ సునీత గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక సునీత తరచుగా వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా సునీత కరోనా వైరస్ కారణంగా వార్తల్లో కెక్కింది. 

చందమామ కథలు అనే ఫేస్ బుక్ పేజీలో ఓ తప్పుడు పోస్ట్ పెట్టారు. ప్రముఖ సింగర్ కు కరోనా పాజిటివ్ అని హెడ్డింగ్ పెట్టి.. పక్కనే సునీత ఫోటోని బ్లర్ చేశారు. బ్లర్ చేసినప్పటికీ ఆ ఫోటోలో ఉన్నది సునీతే అని స్పష్టంగా అర్థం అవుతోంది. వాస్తవానికి కరోనా సోకింది బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు.. కానీ వేళ్ళు మాత్రం సునీత ఫోటో పెట్టారు. 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా: సరైన సమయంలో నితిన్ 20 లక్షల విరాళం

ఈ ఫేక్ పోస్ట్ తో సునీత మనస్తాపానికి గురయ్యారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ పోస్టుల వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సునీత సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. 

కేటీఆర్ సర్ ప్లీజ్ హెల్ప్ చేయండి.. ఇలాంటి వార్తలపై చర్యలు తీసుకోండి.. నా లాగా మరొకరికి జరగకూడదు అని సునీత చెప్పుకొచ్చింది.