పాప్ సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలతో తాజాగా వార్తల్లో నిలిచారు. పాప్ సింగర్ గా స్మిత ఇండియాలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు ఆమె చేసే ఆల్బమ్స్ కు విపరీతమైన మార్కెట్ ఉండేది. జానపద తరహా పాటలకు కొంత స్టైల్ మిక్స్ చేసి ఆమె పాడిన పలు పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

కొన్ని చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడారు. గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న స్మిత తాజాగా అమరావతి రాజధాని సమస్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పూర్తి స్థాయి రాజధాని కాకుండా వైజాగ్, కర్నూలుతో పాటు ఏపీకి మూడు క్యాపిటల్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. 

బయటపడ్డ నయనతార నిజస్వరూపం.. దుమ్మెత్తిపోస్తున్నారు!

దీనితో కార్యనిర్వహణ క్యాపిటల్ అమరావతి నుంచి వైజగ్ కు తరలిపోతుందనే ఆందోళనలో అక్కడి రైతులు ఉన్నారు. గత కొన్ని వారాలుగా అమరావతి రైతులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానికి భూములిచ్చిన తమ పరిస్థితి ఏంటని పలు గ్రామాల ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. కొందరు రైతులు కూడా మరణించారు. 

అమరావతి రైతుల ఆవేదనపై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గుండె బద్దలయ్యే వేదన ఇది. రైతులు ఇంతటి వేదన అనుభవిస్తుంటే ఏమీ పట్టనట్లు ఉండేవారిని చూస్తుంటే భాదగా ఉంది. అమరావతి రైతులారా మీకు నేనున్నా.. మీరు కోసం నేను ప్రతిరోజూ ప్రార్థిస్తున్నా.. మీ బాధని పంచుకుంటున్నా. ఏదైనా సాధించడానికి మనందరం చేతులు కలుపుదాం'అని స్మిత ట్వీట్ చేసింది.