సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు వేధింపులు ఎక్కువయ్యాయి. అసభ్య పదజాలంతో వారిని వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు గనుక మితిమీరుతుంటే వారి ఇంక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కక తప్పడం లేదు. ఇప్పుడు అదే సమస్య సింగర్ కౌసల్యకు కూడా ఎదురైంది.

కౌసల్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె సుపరిచితులే.. ఆమె పాడిన ఎన్నో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆమె వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు కొందరు ఆకతాయిలు ఆమెని బాగా ఇబ్బందిపెడుతున్నారు.

'గూఢచారి' హీరోయిన్ గర్భవతి.. ఫోటో వైరల్!

అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్ లు పంపిస్తూ ఆమెని వేధిస్తున్నారు. అలా మెసేజ్ లు వస్తోన్న నెంబర్స్ బ్లాక్ చేస్తుంటే వేరే నెంబర్స్ నుండి మెసేజ్ లు చేయడం మొదలుపెట్టారట. ఆమె ఏకంగా 342 కాంటాక్ట్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇంకా మెసేజ్ లు ఆగకపోవడంతో, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

తనతో పాటు కౌసల్య మ్యూజిక్ అకాడమీలో కొందరు అమ్మాయిలకు కూడా ఇలానటి అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయని.. అందరికీ ఒకే నెంబర్ నుండి కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని చెప్పారు.

కొందరు ఆకతాయిలు కావాలనే ఇలా చేస్తున్నారనే సందేహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ఈ వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.