Asianet News TeluguAsianet News Telugu

'గూఢచారి' హీరోయిన్ గర్భవతి.. ఫోటో వైరల్!

ఇప్పటికే 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్ తో బాబా పాపులర్ అయింది. అలానే 'సెక్రేడ్ గేమ్స్' సీజన్ 3లో నటించనుందని టాక్. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ 'ఘోస్ట్ సిరీస్'లో నటించింది. ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ శోభిత నటనకి అందరూ ఫిదా అవుతున్నారు. 

Telugu Girl Sobhita Dhulipala Surprises with Pregnant Pic
Author
Hyderabad, First Published Jan 4, 2020, 12:05 PM IST

తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల బాలీవుడ్ తన సత్తా చాటి తెలుగులో కూడా మెరిసింది. అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాలో హీరోయిన్ గా మెరిసి..మంచి ఫేమ్ సాధించింది. ఆ తరువాత ఈ బ్యూటీ డిజిటల్ రంగం వైపు అడుగు వేసింది. ఈ క్రమంలో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఇప్పటికే 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్ తో బాబా పాపులర్ అయింది. అలానే 'సెక్రేడ్ గేమ్స్' సీజన్ 3లో నటించనుందని టాక్. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ 'ఘోస్ట్ స్టోరీస్'లో నటించింది. ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ శోభిత నటనకి అందరూ ఫిదా అవుతున్నారు.

ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్లు.. సినిమా కోసం ఎంతకైనా..!

ఇందులో శోభిత నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక గర్భవతి పాత్రలో నటించింది. రీసెంట్ గా ఈ సిరీస్ లో శోభిత పాత్రకి సంబంధించిన ఒక స్టిల్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూస్తుంటే శోభిత నిజంగానే గర్భవతేనా అన్నట్లుగా సందేహాలు కలుగుతున్నాయి. అంతగా తన లుక్ లో ఇమిడిపోయింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. మలయాళ సినిమా ‘కురూప్’ లో శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా హిందీలో అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మి బాంబ్’ లో కూడా నటిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios