తమిళ నటుడు, టి.రాజేందర్ కొడుకు శింబు తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించాడు. ముందుగా నయనతారతో ఎఫైర్ సాగించాడు. వీరిద్దరూ చాలా కాలం రిలేషన్ లో ఉన్నారు.

నయన్.. శింబుని పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంది. వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతగా వీరి రిలేషన్షిప్ హద్దులు దాటింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.

నితిన్ 'భీష్మ' సూపర్ అంటూ త్రివిక్రమ్ రివ్యూ.. నమ్మొచ్చా!

నయనతార గురించి తెలిసి కూడా హన్సిక.. శింబుని ప్రేమించింది. హన్సికని పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆమె కూడా హ్యాండ్ ఇచ్చేసింది. ఆ తరువాత ఎఫైర్స్ కి దూరంగా ఉంటోన్న శింబు మళ్లీ ఇప్పుడు ఓ కుర్ర హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నాడని కోలీవుడ్ వర్గాల టాక్.

సుభిక్ష అనే ఓ యంగ్ హీరోయిన్ తో శింబు క్లోజ్ గా తిరుగుతుండడం కెమెరాలకు చిక్కింది. అయితే శింబు ఎప్పటిలానే ఈ వార్తలపై స్పందించలేదు. సుభిక్ష మాత్రం శింబు తనకి స్నేహితుడు మాత్రమేనని.. ఎక్కువగా ఊహించుకోవద్దని మీడియాకి చెబుతోంది. సుభిక్ష ఈ వార్తలను ఖండిస్తున్నా.. వీరిద్దరి గురించి రాతలు మోతమోగుతున్నాయి.