బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ 'ఫగ్లీ' చిత్రంతో వెండితెరకి పరిచయమైంది. 'ధోనీ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'భరత్ అనే నేను' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే మరో సినిమాలో నటించింది.

తాజాగా ఈ బ్యూటీ న్యూఇయర్ సందర్భంగా షూటింగ్ నుండి కొంత విరామం తీసుకొని ఆఫ్రికా టూర్ వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఆఫ్రికాలో దిగిన కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు.

అబ్బే.. నేను సెక్స్ చేయలేదు.. అదంతా కెమెరా ట్రిక్!

దీంతో కియారా, సిద్ధార్థ్ లు కలిసే టూర్ కి వెళ్లారంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. శుక్రవారం ఆఫ్రికా నుండి ముంబై చేరుకున్న కియారా పక్కనే సిద్ధార్థ్ కూడా కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. దీన్తి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ జంట ఆ వార్తలపై పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆఫ్రికా ట్రిప్ తో వీరి లవ్ ఎఫైర్ నిజమేననే కంక్లూజన్ కి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం కియారా 'లక్ష్మీబాంబ్', 'ఇండోకి జవానీ', 'షెర్ షా' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Walking safari 🦒 #OneWithNature

A post shared by KIARA (@kiaraaliaadvani) on Jan 2, 2020 at 11:19pm PST

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Further you look, closer you feel

A post shared by KIARA (@kiaraaliaadvani) on Jan 2, 2020 at 11:27pm PST