సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు.. వారితో సెల్ఫీలు దిగడానికి, ఆటోగ్రాఫ్స్ తీసుకోవడానికి అభిమానులు ఎగబడుతుంటారు. అందుకే సెలబ్రిటీలు ఎవరూ కూడా బాడీగార్డ్స్ లేకుండా బయటకి వెళ్లరు. అలా వెళ్తే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

ఒక్కోసారి బాడీగార్డ్స్ ఉన్నా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఫ్యాన్స్ కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఆ ఫ్యాన్సే తన మానాన్ని కాపాడారని చెబుతోంది నటి శ్వేతాతివారి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బాలీవుడ్ బ్యూటీ పలు విషయాల గురించి మాట్లాడింది. 

'వెంకీ మామ' ఫిల్మ్ నగర్ టాక్..!

ఓసారి ఈవెంట్ కోసం రాయ్ పూర్ కి వెళ్లిన శ్వేతాని చూసిన అభిమానులు ఆమెని చుట్టుముట్టేశారట. ఎంత భద్రత ఉన్నప్పటికీ ఫ్యాన్స్ దూకుడు ముందు సరిపోలేదట. ఫ్యాన్స్ అంతా తన మీదకి వచ్చేసరికి తన ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ ఒక్కొక్కటిగా జారిపోయాయట. దాంతో వాళ్లే అడ్డుగా నిలబడి తన పరువుని, మానాన్ని కాపాడారని చెప్పుకొచ్చింది

శ్వేతా తివారి. ఆ సంఘటనతో కొన్ని రోజులు షాక్ లో ఉండిపోయానని తెలిపింది. బుల్లితెరపై ఈ బ్యూటీకి చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈమె 'మేరే డాడ్ కి దుల్హాన్' అనే సీరియల్ లో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో తన రెండో భర్తపై కేసు పెట్టి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.

మొదట ప్రేమించిన పెళ్లి చేసుకున్న వ్యక్తిని దూరం చేసుకుంది శ్వేతా. ఆ తరువాత తన కూతురితో కలిసి జీవించేది. కొన్నాళ్లకు మరో వ్యక్తికి దగ్గరై పెళ్లి చేసుకుంది. కానీ అతడు తన కూతురిని వేధిస్తున్నాడని విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది.