బాలీవుడ్ సీరియల్ నటి శ్వేతా తివారి 'మేరే డాడ్ కి దుల్హాన్' అనే షోతో బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ బ్యూటీ తన రెండో భర్త అభినవ్ కొహ్లీ తనను మానసికంగా వేధిస్తున్నాడని.. తన కూతురు పాలక్ తివారీతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆయనపై గృహహింస కేసు పెట్టింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా తివారి తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో రెండో భర్త అభినవ్ కోహ్లీపై చేసిన ఆరోపణ నేపధ్యంలో తనపై వచ్చిన ట్రోల్స్ ని తిప్పికొట్టారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న ఎంతోమంది కంటే తను బెటర్ అంటూ చెప్పుకొచ్చారు.

హీరోయిన్ పై అక్కడ చెయ్యేసి ఫోటో... షాకైన ఫ్యాన్స్,కామెంట్ల వర్షం

అభినవ్ తో రిలేషన్ పాయిజనస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. అది తనను తీవ్రంగా బాధించిందని.. అందుకే తొలగించుకున్నానని తెలిపారు. ధైర్యంగా ముందుకు వచ్చి అతనితో కలిసి జీవించలేననే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సొంతంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

చాలా మంది రెండో పెళ్లి చేసుకున్న తరువాత కూడా సమస్యలు ఎలా వస్తాయని అడుగుతున్నారని.. అసలు రెండో పెళ్లిలో సమస్యలు ఎందుకు రావని..? ప్రశ్నించింది. కనీసం తను ధైర్యంగా బయటకి వచ్చి సమస్యలను చెప్పుకోగలుగుతున్నానని..  పెళ్లి తరువాత కూడా చాలా మంది అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారని.. వారి కంటే నేను బెటర్ కదా అని చెప్పింది.

తన జీవితంలో కొన్ని తప్పులు చేస్తే జీవించడం ఆపలేనని.. కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. తన పిల్లలు, వారి సంరక్షణ చూసుకోవడం వంటి పనులు చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.