సెలబ్రెటీలు ఏం చేస్తూంటారు..ఎలా లైఫ్ లీడ్ చేస్తుంటారు, ఎలా ఎంజాయ్ చేస్తారు వంటి విషయాలు నిరంతరం గమనిస్తూ,ఫాలో అవుతూంటారు వారి అభిమానులు. అంతేకాదు చాలా సార్లు వాళ్లను అనుకరిస్తూ అరాచకంగా బిహేవ్ చేస్తూంటారు కూడా. దాంతో వాళ్లు ఖచ్చితంగా తన వ్యక్తిగత ప్రవర్తన ఇంట్లో ఎలా ఉన్నా.. బహిరంగంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

అయితే అదే సమయంలో తమ క్రేజ్ కోసం కావాలని రెచ్చగొట్టి వార్తల్లోకి ఎక్కుతూంటారు కొందరు. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా హైల్యాండ్ అలాంటి పనే ఒకటి చేసి వార్తల్లో నిలచింది.

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కి అస్వస్థత!

మొడ్రన్ ఫ్యామిలీ టీవి సీరిస్ తో పాపులర్ అయిన అంతకు ముందు వాంపైర్ అకాడమి, డేట్ అండ్ స్విచ్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి పేరు తెచ్చుకుంది. ఈ అమెరికన్ బ్యూటీ తాజాగా ఓ పిక్ ని ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె రొమ్ములు పట్టుకొని ఆమె బాయ్ ఫ్రెండ్ నిల్చున్నాడు. అంతేకాదు ఆమెతో పాటు ఇంకొందరు కూడా ఇదే తరహా పోజ్ ఇస్తూ గ్రూప్ ఫోటో దిగారు. దీంతో ఈ ఫొటో చూసి ఒక్కసారిగా షాకయ్యారు నెటిజన్లు.
 
ఓ ప్రక్కన మీటూ ఉద్యమం ఉదృతం గా సాగుతున్న నేపథ్యంలో సారా ఇలాంటి షాకిచ్చే ఫొటోను పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. అయితే తమపై అబ్బాయిలు అలా చెయ్యేసినందుకు ఆ అమ్మాయిలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవటం విశేషం.

ఈ విషయమై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫొటోను పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు ఏం సందేశం ఇస్తున్నట్లు...  అమ్మాయిలను ఇలా పట్టుకుని కూడా ఫొటోలు దిగొచ్చు అని కుర్రాళ్లకు సలహాలు ఇవ్వటం తప్ప అంటున్నారు. అయితే ఇది ఫొటోనే కదా అందులో అంత సీరియస్ గా తీసుకోవాల్సింది ఏమిటి అంటున్నారు. ఇక నటి సారా కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు.

2018లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలోనూ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఈవెంట్ నుంచి బయటికి వస్తూ సారా చేతిలో మందు బాటిల్ పట్టుకుని తూగుతూ బయటికి వచ్చారు. ఆ సమయంలో ఆమె వెనకే ఉన్న నటుడిపై పడిపోయింది.