పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మేకప్‌ వేసుకుని చాలా కాలం అయ్యింది. దాంతో ఆయన అభిమానులు మళ్లీ తెరపై కనపడాలి అని బలంగా కోరుకుంటున్నారు. దాంతో ఆయన మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీ అయిన ఆయన తిరిగి సినిమాలో నటిస్తూండటంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. హిందీ హిట్‌ ‘పింక్‌’ తెలుగు రీమేక్‌లో ఆయన అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం విషయంలో పవన్ ఓ డిమాండ్ ని ఆయన ముందు పెట్టినట్లు సమాచారం. అదేమిటీ అంటే పొరపాటున కూడా ఈ సినిమా కు సంభందించిన ఒక్క ఫొటో కూడా లీక్ అవటానికి వీల్లేదని.

ఎందుకంటే సోమవారం నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో ఆయన ఉండగా తీసిన ఫొటో లీక్‌ అయ్యింది. అందులో పవన్‌ కొత్త లుక్‌లో కనపడ్డారు. ఈ గెటప్ ని సీక్రెట్ గా ఉంచాలనుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్  జరుగుతుండటంతో పవన్ ను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు.వారిలో ఎవరో తీసి అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పెట్టేసారు.

'పింక్' రీమేక్.. పవన్ కళ్యాణ్ లుక్ ఇదేనా..?

దాంతో ఊహించని విధంగా ఈ ఫొటో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం PSPK26 అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండ్‌ అయ్యింది. ఈ విషయం పవన్ కు తెలిసి చాలా కోప్పడ్డారట. ఇలాంటివి మరోసారి జరగటానికి వీల్లేదని స్ట్రిక్టుగా చెప్పారని సమాచారం. దాంతో దిల్ రాజు ..తన టీమ్ ని ఎలర్ట్ చేసారని చెప్తున్నారు.

ఇక 10 రోజుల పాటు పింక్ రీమేక్ మొదటి షెడ్యూల్ జరగనుంది. అనంతరం ఫిబ్రవరిలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రం టీమ్. అలాగే ఈ చిత్రంలో నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ నిర్మాతలు. ‘పింక్‌’ కథలో పవన్‌ ఇమేజ్‌కి తగినట్టుగా కొన్ని మార్పులు చేశారట. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరో ప్రకటించలేదు. అయితే పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది. ఈ రూమర్స్ లో  ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

‘పింక్‌’ను ఇప్పటికే తమిళంలో రీమేక్‌ చేశారు. అక్కడ అజిత్‌ హీరోగా నటించారు. బోనీ నిర్మించారు. ఈ రీమేక్‌ కూడా మంచి సక్సెస్ అయ్యి ,బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.