టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్ కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ హీరోయిన్ గా పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. శృతి.. ప్రముఖ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ అతడి మొదటి భార్య సారికలకు పుట్టిన సంతానమే శృతి.

వీరికి మరో కూతురు అక్షర హాసన్ కూడా ఉంది. అయితే పెళ్లైన కొన్నేళ్ళకు కమల్ తన భార్యతో విడిపోయారు. ఆ తరువాత నటి గౌతమితో కలిసి జీవించారు. కానీ గౌతమిని పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్య కమల్.. గౌతమితో కూడా విడిపోయారు. అయితే తన తల్లితండ్రుల విడాకులపై శృతి హాసన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

సుడిగాలి సుధీర్ ని రిజెక్ట్ చేశా.. వాడి గురించి మా ఫ్రెండ్స్ కి తెలుసు.. హీరోయిన్ కామెంట్స్!

తాజాగా ఓ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతికి తన తల్లితండ్రుల గురించి ప్రశ్నలు ఎదురుకాగా.. ఆమె బోల్డ్ గా స్పందించింది. ఈ ప్రపంచంలో విడాకులు తీసుకున్నవారు చాలా మంది ఉన్నారని.. తన తల్లితండ్రులు కూడా విడిపోయారని.. కానీ వాళ్లు సెలబ్రిటీలు కావడం బయట వారికి న్యూస్ అవుతుందని కానీ ఇంట్లో కుటుంబసభ్యులకు న్యూస్ కాదని చెప్పింది. 

వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని.. ఎందుకంటే జీవితంలో ఇద్దరికీ సంతోషంగా ఉండే హక్కు ఉందని.. కలిసి ఉంటూ సంతోషంగా లేకపోతే విడిపోవడమే మంచిదని శృతి చెప్పింది. తన తల్లితండ్రులు విడిపోయిన కొద్దిరోజులకే తనకు ఆ విషయం అర్ధమైందని.. ఇద్దరు మనుషులు విడిపోయినప్పుడు బాధగా ఉంటుందని.. కానీ రిలేషన్షిప్ సెట్ అవ్వనప్పుడు వదిలేయడమే మంచిదని చెప్పింది. 

ఇటీవల శృతి హాసన్ కూడా తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ విడిపోయింది. దీంతో తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటోంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో రవితేజ సరసన ఓ సినిమాకి సైన్ చేసింది. అలానే బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.