సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సాఫ్ట్ వేర్ సుధీర్'. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మంచి వినోదాత్మక చిత్రంగా తెరక్కుతోంది. సుధీర్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది. సినిమా ప్రమోషన్ లో భాగం యూనిట్ మొత్తం ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. సుధీర్ కు జోడిగా ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ నటించింది. ధన్య బాలకృష్ణన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిత్ర విశేషాలు తెలియజేసింది. 

సుధీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదారేళ్ళ అయిపోతోంది. సుధీర్ పక్కన హీరోయిన్ గా నటించాలని అడిగారు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతోంది.. మళ్ళీ ఇప్పుడు కొత్త హీరో పక్కన నటించడం అవసరమా అని భావించాను. దాదాపుగా ఈ సినిమాని రిజెక్ట్ చేశాను. ఈ సినిమా నేను చేయలేక పోవచ్చు అని నిర్మాతలకు చెప్పేశాను. 

ఆ తర్వాత మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ సుధీర్ మూవీ కి సంబంధించిన డిస్కషన్ వచ్చింది. రిజెక్ట్ చేశానని వారితో చెప్పా. నా ఫ్రెండ్స్ వెంటనే.. సుధీర్ సినిమాని రిజెక్ట్ చేశావా.. లేదు ఈ సినిమా నువ్వు తప్పకుండా చేయాలి. సుధీర్ కు చాలా క్రేజ్ ఉంది. మా అందరికీ సుధీర్ అంటే పిచ్చి అని మా ఫ్రెండ్స్ అన్నారు. దీనితో సుధీర్ కు కూడా మంచి క్రేజ్ ఉందని అనుకున్నా. 

కొంతమంది హీరోలకు నాలుగైదు సినిమాలు చేశాక క్రేజ్ వస్తుంది. కానీ సుధీర్ ఆల్రెడీ క్రేజ్ తెచ్చుకుని హీరో అయ్యాడు. అందుకే తిరిగి మళ్ళీ ఈ సినిమా చేస్తానని నిర్మాతలకు చెప్పా. సుధీర్ హీరో కాకముందే అంతటి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వాడికి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు అని ధన్య బాలకృష్ణన్ కామెంట్స్ చేసింది. 

సోషల్ మీడియాలో సుధీర్ అభిమానులు సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాపై చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ధన్య ఆశాభావం వ్యక్తం చేసింది. రాజశేఖర్ రెడ్డి గారికి ఇది డెబ్యూ మూవీ. అయినా కూడా ఆయన మంచి అనుభవం ఉన్న కమర్షియల్ దర్శకుడిలా ఈ చిత్రాన్ని రూపొందించారు అని ధన్య ప్రశంసించింది. 

శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని శేఖర్ రాజు నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో షియాజీ షిండే, ఇంద్రజ, పోసాని, నాజర్ లాటి సీనియర్ నటులు నటిస్తునడం విశేషం.