'బాహుబలి' తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం 'RRR'షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు.

దేశ విదేశీ నటులతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో నటిని తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి రూపొందించిన 'ఛత్రపతి' సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రియాని ఇప్పుడు తన 'RRR' సినిమా కోసం తీసుకున్నాడట దర్శకధీరుడు.

మళ్ళీ దెబ్బేసిన రాజమౌళి.. RRR ఇక వచ్చే ఏడాదే!

ఇప్పటికే హాలీవుడ్ నుండి ఒలివియా మోరిస్‌ ని బాలీవుడ్ నుండి అలియా భట్ ని తీసుకున్న రాజమౌళి.. తాజాగా శ్రియాకి కూడా సినిమాలో అవకాశం కల్పించాడట. ఈ సినిమాలో ఆమె ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కి జంటగా ఆమె కనిపించనుందని సమాచారం.

గతంలో ఈ బ్యూటీ అజయ్ దేవగన్ తో కలిసి 'దృశ్యం' సినిమాలో నటించింది. అయితే.. ప్రస్తుతం వీరిద్దరి మధ్యలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.