ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రియా దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడింది. అప్పట్లో శ్రియాకి మామూలు ఫాలోయింగ్ ఉండేది కాదు. ఇప్పటికీ కూడా తన ఫిట్ నెస్ తో షాకిస్తోంది ఈ బ్యూటీ.

ఇటీవల రష్యన్ కి చెందిన మ్యూజిషియాన్ ఆండ్రూని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత ఈ బ్యూటీకి సినిమాఅవకాశాలు బాగా తగ్గాయి. సినిమాల్లో ఛాన్స్ లు లేకపోతేనేం.. అందాల ఆరబోతకి సోషల్ మీడియా ఉంది కదా అన్నట్లు.. తన హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతోంది.

OMG Daddy song: తండ్రిని చూసి తల బాదుకుంటున్న బన్నీ పిల్లలు

ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లలో పాల్గొనడం వాటిని సోషల్ మీడియా షేర్ చేయడం వంటివి చేస్తోంది. తన హాట్నెస్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. రీసెంట్ గా శ్రియా తిరువనంతపురంలోని ఇన్ఫినిటీ హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ లో బ్లాక్ కలర్ బికినీ వేసుకొని ఎంజాయ్ చేస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రియా. 

ఈ వీడియో అభిమానుల్లో సెగలు పుట్టిస్తోంది. వీడియో పెట్టిన కొద్ది గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా హాట్ గా ఉన్నావని, ఎవర్ గ్రీన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో రూపొందనున్న 'అసురన్' రీమేక్ లో వెంకీ సరసన శ్రియా కనిపించనుందని అంటున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి 'గోపాల గోపాల', 'సుభాష్ చంద్రబోస్' వంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

No filter. Pure bliss. Ocean 🌊 infinity pool. Mom’s photography.

A post shared by @ shriya_saran1109 on Nov 13, 2019 at 6:05am PST