Asianet News TeluguAsianet News Telugu

OMG Daddy song: తండ్రిని చూసి తల బాదుకుంటున్న బన్నీ పిల్లలు

బిగ్ బడ్జెట్ మూవీ "అల.. వైకుంఠపురములో..". గత కొన్ని రోజులుగా సినిమాకు సంబందించిన రెండు పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జనాలను ఆకర్షించేందుకు మరో సాంగ్ ని రెడీ చేశారు. బాలల దినోత్సవ సందర్బంగా ఆ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు. 

Ala Vaikunthapurramuloo - OMG Daddy Song Teaser
Author
Hyderabad, First Published Nov 14, 2019, 12:23 PM IST

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ "అల.. వైకుంఠపురములో..". గత కొన్ని రోజులుగా సినిమాకు సంబందించిన రెండు పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జనాలను ఆకర్షించేందుకు మరో సాంగ్ ని రెడీ చేశారు.

బాలల దినోత్సవ సందర్బంగా ఆ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు.   #OMG డాడీ సాంగ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. పైగా అందులో అల్లు అర్జున్ కొడుకు కూతురు కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఓ మై గాడ్ డాడీ - బ్యాడ్ గా ఉండకు, హార్డ్ గా అస్సలు ఉండకు. అది నన్ను చాలా సాడ్ గా చేస్తుంది" అనే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక సాంగ్ లిరిక్స్ కి తగ్గట్టుగా బన్నీ పిల్లలు - అల్లు అయాన్ - అల్లు ఆర్హ ఇచ్చిన హావభావాలు మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. ఇద్దరు కూడా వారి స్టైల్ కి తగ్గట్టుగా అల వైకుంఠపురములో పోస్టర్ ని చూసి తల బాదుకోవడం సరదాగా అనిపిస్తోంది. ఇక ఫుల్ సాంగ్ ని ఈ  నెల 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

Reas also: తెలుగు కమెడియన్స్ రెమ్యునరేషన్స్.. రోజుకి ఎంతంటే?

థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ - హారిక హాసిని ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా పూజ హెగ్డే - నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios