గత కొద్దిరోజులుగా ప్రముఖ మలయాళ దర్శకుడు వి.ఏ శ్రీకుమార్ మీనన్‌, నటి మంజు వారియర్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే మంజు వారియర్ ఈ దర్శకుడుపై పోలీసు కేసు నమోదు చేసింది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు క్యాంపెయినింగ్ చేస్తూ.. తన పరువును తీస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొంది. అంతేకాకుండా తన స్నేహితులను బెదిరిస్తున్నారని… అయన నుంచి తనకు ప్రాణహాని ఉందని మంజు వారియర్ కేరళ డీజీపీ లోకనాథ్ బెహెరా‌కు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం ఆమె పోలీసులకు అందచేశారు.

గతంలో మంజు వారియర్.. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో అనేక  కళ్యాణ్ జ్యువెలరీ యాడ్స్‌ చేయడమే కాకుండా అతని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పుష్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్స్‌కు కూడా పలు ప్రకటనలు చేసింది. ఇక మెహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఒడియన్‌’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి శ్రీకుమార్‌ మేనన్‌ దర్శకత్వం వహించారు.ఆ  సినిమా డిజాస్టర్ అయ్యింది.

పేకాట ఆడమని చెప్తోన్న కాజల్..!

‘ఒడియన్’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ కావడానికి తానే బాధ్యురాలినని సినిమాకి సంబంధించిన పలు ప్రమోషనల్ ఇంటర్వూస్‌లో శ్రీకుమార్ చెప్పినట్లుగా ఉన్న ఆధారాలను సైతం ఆమె కంప్లైంట్‌కు జత చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు శ్రీకుమార్‌ సోషల్‌మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించారు.

‘మంజు.. నువ్వు ప్లాబ్లమ్స్ ల్లో ఉన్నప్పుడు నేను మాత్రమే నీకు సహాయం చేశానన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నావు? నావల్లే నీకు అనేకమందితో పరిచయం కలిగింది. ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు. నువ్వు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు. మీడియా ద్వారా నువ్వు నా మీద పెట్టిన కంప్లైంట్  గురించి తెలుసుకున్నాను. ఈ కేసు విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను. నాకు, మంజు వారియర్‌కు మాత్రమే తెలిసిన ఎన్నో నిజాలను ఈ విచారణలో బయటపెడతాను.’ అని శ్రీకుమార్‌ పేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. ఈ విషయమై మళయాళ పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది.