టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి కాజల్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఒకానొక సమయంలో ఆమె సినిమాల కారణంగా తీరిక లేకుండా గడిపింది. కానీ ప్రస్తుతం ఆమెకి అవకాశాలు బగా తగ్గిపోయాయి. కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో కాజల్ కాస్త డల్ అయింది. తనకొస్తున్న అరకొర అవకాశాలతో నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో ఆమెకి ఓ యాడ్ లో నటించే ఛాన్స్ రావడంతో వెంటనే ఒప్పుకుంది.

ఇంతకీ ఆ యాడ్ ఏంటో తెలుసా.. ఆన్ లైన్ లో పేకాట ఆడమని ఎంకరేజ్ చేయడం. ఆన్ లైన్ రమ్మీ, కార్డ్ గేమ్స్ ని ఇండియాలోని మరికొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణాలో కూడా నిషేధించారు. ఆన్ లైన్ లోఇటువంటి గేమ్ లు ఆడడం వలన చాలా మంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారని తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది స్కిల్ గేమ్ అంటూ సదరు ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్లు కోర్టులో పోరాడుతున్నాయి.

షాకిచ్చే ఫొటోలు లీక్: 'భారతీయుడు 2'లో కమల్ లుక్

తెలంగాణా మాట ఎలా ఉన్నా.. ఏటా ఇండియాలో ఆన్ లైన్ రమ్మీ రెవెన్యూ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.. దీంతో మరింత మందిని ఇటువైపు  ఆకర్షించడానికి వివిధ వెబ్ సైట్లు ప్రముఖ హీరోయిన్లని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటున్నాయి. ఒక కార్డ్ గేమ్స్ వెబ్ సైట్ కి సన్నీలియోన్ ఎప్పటినుండో ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.

 

ఇప్పుడు కాజల్ కూడా ఓ పేకాట  వెబ్ సైట్ కి ప్రచారం చేసే బాధ్యతలు తీసుకుంది. కేవలం ప్రచారమే కాకుండా తాను రెగ్యులర్ గా ఆన్ లైన్ లో రమ్మీ ఆడతానని చెబుతోంది. కాజల్ లాంటి ఫేమ్ ఉన్న హీరోయిన్లు ఇలాంటి ఆటలు ఆడమని ఎంకరేజ్ చేస్తుండడంపై పలువురు విమర్శిస్తున్నారు. దీని కారణంగా నష్టాలే తప్ప ఎటువంటి ఉపయోగం  ఉండదని కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని కాజల్ కి సలహాలు ఇస్తున్నారు.