యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. రేపు(శుక్రవారం ఫిబ్రవరి 21) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి కొన్ని గంటల్లోనే ఓవర్సీస్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. నితిన్ కెరీర్ కు ఇది చాలా కీలకమైన చిత్రం. ఎందుకంటే నితిన్ చివరగా నటించిన మూడు చిత్రాలు నిరాశపరిచాయి. 

ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు.. పైగా టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రష్మిక గ్లామర్ కూడా ఈ చిత్రానికి తోడు ఉంది. నితిన్ మంచి విజయం అందుకునేందుకు భీష్మ చిత్రం మంచి అవకాశం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

తాజాగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో వెంకీ కుడుముల మాట్లాడుతూ భీష్మ కథ గురించి ఆసక్తికర విశేషాలు తెలిపాడు. నితిన్ ఈ చిత్రంలో మీమ్స్ చేసుకునే కుర్రాడిగా కనిపిస్తాడు. అలాంటి నితిన్ కి, సేంద్రియ వ్యవసాయానికి సంబంధం ఏంటి అనేది ఆసక్తికరంగా రూపొందించినట్లు వెంకీ కుడుముల తెలిపారు. 

బ్రతికుండగానే హీరోయిన్ కి శ్రద్ధాంజలి.. నాగార్జున ప్రామిస్ నిలబెట్టుకోలేదు!

భీష్మ అంటే పురాణాల ప్రకారం.. భీష్ముడు ఆజన్మబ్రహ్మచారి. కానీ నితిన్ కి ఈ చిత్రంలో ప్రేయసి ఉంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సీనియర్ నటుడు అనంత్ నాగ్ బ్రహ్మచారిగా కనిపిస్తారని వెంకీ కుడుముల ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశాడు. అనంత్ నాగ్ కి, నితిన్ కి సంబంధం ఏంటనేది కూడా సినిమా చూసే తెలుసుకోవాలని వెంకీ కుడుముల అన్నారు. 

నాగశౌర్య ఆరోపణలపై 'భీష్మ' డైరెక్టర్ రెస్పాన్స్!

త్రివిక్రమ్ గారి ఆలోచన మేరకే ట్రైలర్ లో కథ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాం. సినిమా కథ గురించి తెలిస్తే ఆడియన్స్ సరైన అంచనాలతో ఈ చిత్రానికి వస్తారని త్రివిక్రమ్ గారు అన్నారు. భీష్మ తర్వాత తన తదుపరి చిత్రం ఇంకా నిర్ణయించుకోలేదని.. మైత్రి, యువి క్రియేషన్న్ బ్యానర్స్ లో సినిమాలు చేస్తానని వెంకీ కుడుముల అన్నారు.