నాగశౌర్య హీరోగా నటించిన ఛలో చిత్రంతో వెంకీ కుడుముల దర్శకుడిగా మారాడు. ఛలో చిత్రం మంచి విజయం సాధించింది. ఆ చిత్ర సక్సెస్ నాగశౌర్య కెరీర్ కు, వెంకీ కుడుముల కెరీర్ కు బాగా ఉపయోగపడింది. వెంకీ కుడుములు ప్రస్తుతం నితిన్ హీరోగా భీష్మ చిత్రాన్ని తెరక్కించాడు. ఈ మూవీ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ కుడుములకు నాగశౌర్య గురించి ప్రశ్న ఎదురైంది. కొన్ని రోజుల క్రితం అశ్వద్ధామ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ కుడుములపై నాగశౌర్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. వెంకీ కుడుములని తన ఇంట్లో మనిషిలా చూసుకుంటే నమ్మక ద్రోహం చేశాడని, ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని నాగశౌర్య వ్యాఖ్యలు చేశాడు. 

ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య!

దీనిపై స్పందించాల్సిందిగా మీడియా వెంకీ కుడుములని ప్రశ్నించింది. కానీ నాగశౌర్య వ్యాఖ్యలపై స్పందించడానికి వెంకీ కుడుముల ఇష్టపడలేదు. 'నాకు సాయం చేసిన వారికి నేను తప్పకుండా క్రెడిట్ ఇస్తాను. ఇప్పటి వరకు అలాగే చేశాను. దీనిపై ఇంతకు మించి మాట్లాడలేను అని వెంకీ కుడుముల తెలిపాడు. 

విజయ నిర్మల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహేష్(ఫొటోస్)

మీడియా ఒత్తిడి చేసినప్పటికీ వెంకీ ఈ వ్యవహారం గురించి స్పందించేందుకు ఇష్టపడలేదు. ఛలో కథ తనదని నాగశౌర్య చెప్పిన సంగతి తెలిసిందే. తన తల్లి వెంకీ కుడుములని రెండో కొడుకులా చూసుకుందని.. ఛలో సక్సెస్ తర్వాత అతడికి కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చామని నాగశౌర్య తెలిపాడు. నాగశౌర్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.