నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం V. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సమ్మర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ అధికారిగా, నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. 

ఆ మధ్యన విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు, నెగిటివ్ షేడ్స్ లో నాని అదరగొడుతున్నారు. ఈ చిత్రంలో నాని ప్రతినాయకుడిగా నటిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.  

చూడగానే ఎగిరి గంతేసిన తమన్.. పవన్ ఫాలో అవుతోంది వీరినే!

తాజాగా ఈ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విలన్ నాని అని అంతా భావిస్తున్న తరుణంలో ఈ వార్త అభిమానులకు షాకింగ్ ట్విస్ట్ లా మారింది. Vలో అసలైన విలన్ నాని కాదట. ఈ చిత్రంలో అదితి రావు హైదరి ఓ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా నివేత థామస్ నటిస్తోంది. అదితి రావు హైదరి కథలో అసలైన విలన్ అని అంటున్నారు. 

ఇదే కనుక నిజమైతే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందిస్తునట్లే. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో వేచి చూడాలి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మాత.