పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహలకందని వ్యక్తి. అజ్ఞాతవాసి చిత్రంలో వీడి చర్యలు ఊహాతీతం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ చర్యలు నిజంగానే ఊహాతీతంగా ఉంటాయి. అందరు హీరోలు సోషల్ మీడియాలో దూసుకుపోతున్న రోజుల్లో పవన్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. 

రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత పవన్ ట్విట్టర్ లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అప్పట్లో ట్విట్టర్ లో ఎవరిని ఫాలో అయ్యేవాడు కాదు. కానీ పవన్ కళ్యాణ్ మొట్టమొదట ఫాలో అయింది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ని. ట్విట్టర్ లో 3.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న పవన్ ఫాలో అయ్యేది కేవలం 34 మందిని. 

పవన్ ఫాలో అయ్యే వారిలో ప్రముఖ రాజకీయ నాయకులు, సామజిక కార్యకర్తలు, సినీ తారలు ఉన్నారు.  తాజాగా పవన్ కళ్యాణ్ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ని ఫాలో అవడం ప్రారంభించారు. పవన్ నుంచి నోటిఫికేషన్ రాగానే తమన్ ఎగిరి గంతేశాడు 

తనకు ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అని తమన్ ట్వీట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ తన సోదరుడు రామ్ చరణ్, అన్నయ్య చిరంజీవి, అమితాబ్ బచ్చన్, శేఖర్ కపూర్, సాయిధరమ్ తేజ్ లాంటి సెలెబ్రిటీలని ఫాలో అవుతున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి ప్రముఖ రాజకీయ నేతల్ని పవన్ ట్విట్టర్ లో ఫాలో అవుతున్నాడు.