శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉండబోతోందనే టెన్షన్ నిర్మాత కన్నా శర్వానంద్ ఎక్కువ పడుతున్నాడట. 

రణరంగం డిజాస్టర్ అవటంతో శర్వానంద్ ఈ సినిమాపైనే ఆశలు అన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా ఓ రకంగా అగ్ని పరీక్ష లాంటిదంటున్నారు.తన గత చిత్రానికి ఓపినింగ్స్ సైతం సరిగ్గా రాకపోవటంతో ఈ సినిమా మ్యాజిక్ చేస్తే తను ఒడ్డునపడిపోతానని భావిస్తున్నట్లు సమాచారం.

సమంత లాంటి అమ్మాయైతే.. పెళ్లి చేసుకుంటా.. శర్వానంద్ కామెంట్స్!

అయితే ఈ సినిమాలో సమంతకే ఎక్కువ మార్కులు పడతాయని అంతటా వినిపిస్తోంది. ఆమె తన నటనతో శర్వాని కనపించనీయకుండా చేసిందంటున్నారు. అదే కనక జరిగితే సినిమా హిట్టయినా శర్వాకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. దానికి తోడు ఇది తమిళంలో హిట్ అయిన రీమేక్ కావటంతో ..హిట్ అయితే ఏముంది రీమేక్ యాజటీజ్ చేసాడంటున్నారు. అదే తేడా కొడితే రీమేక్ కూడా చేయలేక పోయారనే విమర్శలు వస్తాయి. 

ముఖ్యంగా ఫీల్ గుడ్ సినిమాలతో ఓ పెద్ద సమస్య ఉంటుంది. అదే మ్యాజిక్ మరో సారి రిపీట్ చేయటం చాలా చాలా కష్టం. అవే సీన్స్ ఉన్నా...అదే ఫీల్ క్యారీ కాకపోతే కష్టం. దానికి తోడు శర్వానంద్..గతంలో చేసి మంచి విజయం సాధించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా సైతం ఇలాంటి కాన్సెప్ట్ తో రూపొందిందే కావటం చెప్పుకోదగ్గ విషయం. అయితే అదే సమయంలో శర్వాలో మంచి నటుడు ఉన్నాడనే విషయం మాత్రం మనం మర్చిపోకూడదు.

హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ – ‘‘ నా కెరీర్‌లో `జాను` గొప్ప సినిమాగా నిలిచిపోతుంది.  నేను మ‌ర‌చిపోలేని సినిమా. నేను ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశానంటే కార‌ణం స‌మంత‌. ఆమెతో యాక్ట్ చేయాలంటే ఒళ్లు జాగ్ర‌త్త‌గా పెట్టుకుని యాక్ట్ చేయాలి. సీన్‌ను తినేస్తుంది. కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా చేశాను. సమంతతో ఓ సినిమా కూడా చేయ‌లేక‌పోయానే అని అనుకునేవాడిని.

ఈ సినిమాలో త‌న‌తో క‌లిసి గొప్ప సినిమాలో న‌టించాను. అలాగే నేను, స‌మంత బాగా న‌టించ‌డానికి కార‌ణం డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్‌. ప్ర‌తి ఒక్క‌రికీ ఫ‌స్ట్ ల‌వ్ ఉంటుంది. ఈ సినిమా చూసిన‌ప్పుడు అందరూ క‌నెక్ట్ అవుతారు. బ్యూటీఫుల్ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కార‌ణ‌మైన స‌మంత‌కు థ్యాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 7న థియేట‌ర్స్‌లో సినిమాను ఎంజాయ్ చేయండి’’ అన్నారు.