టాలీవుడ్ హీరోగా ఎన్నో సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం '96' సినిమా రీమేక్ లో నటిస్తున్నారు. 'జాను' అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సమంత, శర్వా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ఒప్పుకున్నందుకు చాలా భయం వేసిందని.. నిద్రపట్టేది కాదని.. సమంత చెప్పింది.

'జాను' ట్రైలర్ : 'నువ్ వర్జినా..?' శర్వాకి షాకిచ్చిన సమంత!

ఇప్పటికీ మా ఇద్దరిలో చాలా భయం ఉందని.. సినిమా టీజర్, ట్రైలర్లు వచ్చినప్పుడు ఎలాంటి ట్రోల్స్ వస్తాయోనని భయపడినట్లు శర్వానంద్ చెప్పుకొచ్చారు. 'జాను' సినిమాని చాలా ఎమోషనల్ గా తెరకెక్కించామని చెప్పారు. ఈ సినిమా ప్రెజంట్ జనరేషన్ కి సంబంధించిన కథ అని.. సినిమాలో ప్రధానాంశం ప్రేమని చెప్పారు.

పదో తరగతిలో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునే వాళ్ళు వందలో ఐదు శాతం మంది కూడా ఉండకపోవచ్చని.. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.  

తన జీవితంలో ఎలాంటి ప్రేమకథలు లేవని శర్వా చెప్పారు. కానీ తనకు 'మజిలీ' సినిమాలో సమంత లాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని.. భర్త ఏం చేసినా తను చాలా సైలెంట్ గా ఉంటుందని.. భర్తని బాగా చూసుకుంటుందని చెప్పారు.