తమిళంలో విడుదలైన సంచలన విజయాన్ని సాధించిన '96' మూవీని తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించగా.. ఆ పాత్రలను తెలుగులో శర్వానంద్, సమంతలు పోషిస్తున్నారు.

ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

సమంత, శర్వా 'జాను' ఫస్ట్ సాంగ్.. మెస్మరైజ్ చేసేశారు!

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇప్పటివరకు సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు.

ఆ పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. శర్వానంద్ చెప్పే కవితతో ట్రైలర్ మొదలైంది. మధ్యలో సమంత.. 'Are You A Virgin..?' అని శర్వాని అడగగా.. ఏం మాట్లాడుతున్నావ్ జాను అంటూ చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి!