ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన 96 చిత్రం తమిళంలో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ అద్భుతమైన ప్రేమ కథా చిత్రానికి తమిళ ప్రేక్షకులను బ్రహ్మరథం పట్టారు. 96 చిత్రం తెలుగులో 'జాను'గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దర్శత్వంలోనే జాను చిత్రం కూడా రూపొందుతోంది. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేశారు. 

సంగీత దర్శకుడు గోవింద్ వసంత స్వరపరిచిన ఈ మెలోడీ గీతం హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంది. చిన్మయి, గౌతమ్ భరద్వాజ్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఇక శ్రీమణి ఈ పాటకు ఎమోటినల్ గా అనిపించే లిరిక్స్ అందించారు. 

స్టేజి వెనుక మాజీ భర్తతో హీరోయిన్ రాసలీలలు.. వైరల్ అవుతున్న పిక్స్!

సమంత, శర్వానంద్ తొలి సారి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి నటించారు. ఇటీవల సమంత అద్భుతమైన పాత్రలు ఎంచుకుంటోంది. జాను చిత్రంతో కూడా సమంత తన నటనకు ప్రశంసలు అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.